కోవిడ్‌కు ఆక్సిజన్ థెరపీ
ఆరోగ్య భాగ్యం

రిస్క్ ప్రాబ్లిమ్స్ :
డిప్రెషన్ ఆఫ్ వెంటిలేషన్.హైపర్‌బారిక్ ఆక్సిజన్ టాక్సిసిటీ, కేంద్రనాడీ మండలం, కన్ను, పల్మోనాడీ, లంగ్స్‌లోని నరాలు దెబ్బతిన్నప్పుడు లంగ్ ఎటలెక్టనిస్, ప్రయోణమ్యర్ బేబిస్, బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో రెటినోపతీ ఉన్నప్పుడు, బాక్టీరియల్, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న, నెగటివ్ ప్రెషర్‌ఉన్న పారాక్వెట్ పాయిజినింగ్, పల్మోనరీ టాక్సిసిటీ వంటి రిస్క్ ప్రాబ్లమ్స్‌ని బట్టి డాక్టర్ల సలహా ప్రకారం ఆక్సిజన్ థిరపీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఉపయోగాలు :
హైపర్ బాలివ్ ఆక్సిజన్ థిరపీ : మొండి గాయాలు, డయాబెటిన్ న్యూరోపతీ, అల్చర్స్, కాలిన గాయాలు, ఆపరేషన్ గాయాలున్న వారిలో రక్త సరఫరా తగ్గుతుంది.
అలాంటప్పుడు వీరిని ఆక్సిజనేటెడ్ గాజు గదిలో ఉంచి 1.5-3రెట్లు ఆక్సిజన్ ప్రెషర్‌ని పెంచడం వల్ల కొత్త కణాలు, సూక్ష్మ రక్తనాళాలు పుట్టి గాయాలు త్వరగా మానిపోతాయి. రిని 60-90 నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రతని బట్టి 10-20 సార్లు చేయవచ్చు.
అంతేగాకుండా ఎయిడ్స్, ఆల్జీమర్స్ డిసీజ్, కేన్సర్ షాక్, బ్లీడింగ్, కేసుల్లో, ఎమర్జెన్సీగా, ఫస్ట్‌ఎయిడ్ చికిత్సగా దీన్ని ఉపయోగించవచ్చు.
జాగ్రత్తలు :w సరైన గాలి, వెలుతురున్న ఇంటిలో ఉండాలి. ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు కిటీకిలు, తలుపులు తెరిచి గాలి వచ్చేట్లు చేయాలి. w ఆరు బైట వాకింగ్, టెర్రస్‌పైకి పోవడం, రోజూ 30-60 నిమిషలు ఆరుబైట గాలిని స్వచ్ఛమైన గాలిని పీల్చడం మంచిది.
శారీరక, మానసిక విశ్రాంతి అవసరం. యెంటల్ రిలాక్సేషన్ ముఖ్యం.
నిద్ర పోయేముందు గోరువెచ్చని నీళ్లు త్రాగడం, మ్యూజిక్ వినడం, పుస్తకాలు చదవడం ముఖ్యం. ప్రశాంతతోపాటు పరిశుభ్రత చాలా అవసరం.
పోషకాహార లోపం లేకుండా, రక్తహీనత లోపం లేకుండా రుచి ఆహారాన్ని (పాలు, గ్రుడ్లు, మాంసం, ఔషదపండ్లు, కూరగాయాలు) తీసుకోవాలి.
కరోనా రెండు మూడు సార్లు నెగటివ్ వచ్చినా, పాజిటివ్ వచ్చి తగ్గిన వారిలో వాయునాళాల దగ్గర రక్తం గడ్డలా మారి ఉచ్ఛాస, నిచ్ఛాస్వాలకి అడ్డుగా ఉండడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గి శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపి ఊపిరి అండక ఇతర అవయావాలు దెబ్బతిని
మరణం సంభవించే అవకాశం ఉంటుంది.
కాబట్టివేడి తాజా ఆహారం తీసుకోవాలి. వేడినీటిలో ఉప్పువేసి పుక్కిలించడం, ఆవిరి పట్టడం మంచిది.
పల్స్ ఆక్సిమీటర్‌ని వాడి శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ ఎంత ఉండేది తెలుసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
పల్స్ ఆక్సిమీటర్:
ఇది ఎలక్ట్రానిక్ ప్రాసెసర్ వరియు మెడికల్ డివైస్. ఈ చిన్న సాధనం ద్వారా గుండె వేగంతోపాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ అందుతుందో లేదో అని తెలుసుకోవచ్చు.
శరీరంలో ఆక్సిజన్ శాతం పడిపోవడం (90%కన్నా తక్కువ)వల్ల శ్వాస తీసుకో వడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీని ద్వారా రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని సలభంగా నొప్పి లేకుండా, త్వరితంగా చంటిపిల్లలు, పెద్దలు సునాయసంగా తెలుసుకోవచ్చు మరియు వాడుకోవచ్చు.
-డాక్టర్. కె.ఉమాదేవి, తిరుపతి
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/