తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టబోతున్న మరో వందే భారత్ ట్రైన్

తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ పరుగులుపెట్టబోతుంది. ఈ రూట్‌ లో వందేభారత్ నడిస్తే.. సికింద్రాబాద్ -గుంటూరు మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గే అవకాశం ఉంది. అటు గుంటూరు నుంచి తిరుపతికి కూడా ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు.

సికింద్రాబాద్ -తిరుపతి వందే భారత్ రైలును బీబీ నగర్- నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ రైలును వరంగల్, ఖాజీపేట మార్గంలో నడపాలని రైల్వే అధికారులు భావించినప్పటికీ.. ఆ రూట్‌ లో దూరం ఎక్కువ అవుతుండడంతో బీబీ నగర్ నడికుడి మార్గంలో నడపాలని నిర్ణయించారు. బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు ఉన్న రూట్ లో రైల్వే ట్రాక్‌ ను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఏప్రిల్‌ 8న ప్రారంభించే అవకాశం ఉంది.