పూజల కోసం మాత్రమే తాము ఫామ్ హౌస్ కు వెళ్ళాం – నంద కుమార్

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు అంశానికి తెరపడింది. బుధువారం రామచంద్ర భారతి, నంద కుమార్, సింహ యాజ్ లు మొయినాబాద్ ఫామ్ హౌస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాయబారాలు సాగించారని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి ఏసీబీ జడ్జ్ వీరిని తక్షణం విడుదల చేయాలనీ ఆదేశించారు. వీరిని కస్టడీకి తీసుకోవాల్సిన ఆధారాలు లేవని , వీరిపై పెట్టిన కేసు తప్పుగా ఉందని తెలిపి షాక్ ఇచ్చారు.

ఇదిలా ఉంటె నంద కుమార్ మాట్లాడుతూ.. పూజల కోసం మాత్రమే తాము ఫామ్ హౌస్ కు వెళ్ళామని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తమకు తెలియదన్న ఆయన.. సింహ యాజీ స్వామీజీతో సామ్రాజ్య లక్ష్మీ పూజ జరిపించడానికి మాత్రమే ఫామౌస్ కు వెళ్ళామన్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి సమాచారంతో సోదాలు చేశారో తమకు తెలియదని, అసలు ఏం స్కామో తమకు తెలియదన్నారు.