నేటి నుండి ముంబయిలో 144 సెక్షన్

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు


ముంబయి: మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 252 కేసులు నమోదు అయ్యాయి. ఓవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో 144 సెక్షన్ విధించింది. ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ నియంత్రించేందుకు డిసెంబర్ 30 నుంచి జనవరి 7 వరకు ముంబైలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ముంబైలోని రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, పబ్‌లు, రిసార్టులు, క్లబ్‌లు సహా అనేక బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా నిబంధలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/