హైదరాబాద్ లో ఈరోజు , రేపు స్కూల్స్ బంద్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో ఈరోజు , రేపు స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. 29న స్కూళ్లలో ఎన్నికల ఏర్పాట్లు, 30న పోలింగ్ ఉండటం, చాలా మంది టీచర్లు ఎన్నికల డ్యూటీలో ఉండటంతో రెండ్రోజులు సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యాశాఖను ఆదేశించారు.

దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లకు రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1న తిరిగి యధావిధిగా స్కూళ్లు ఓపెన్ కానున్నాయి. అలాగే నిమ్స్ హాస్పటల్ కు కూడా సెలవు ప్రకటించారు పీఆర్వో సత్య గౌడ్. ఎమర్జెన్సీ విభాగం అందుబాటులో ఉంటుందని , శుక్రవారం నుంచి ఆస్పత్రిలో అన్ని సేవలు యధావిధిగా నడుస్తాయన్నారు.