రేవంత్ రెడ్డి పాటకు డాన్స్‌ చేసిన ప్రియాంక గాంధీ

దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా? : ప్రియాంకగాంధీ

priyanka-gandhi-dances-for-revanth-reddy-song

హైదరాబాద్‌ః టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాటకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ స్టెప్పులేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కార్నర్ మీటింగ్.. రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్‌లో ప్రియాంకగాంధీ ప్రసంగించారు. ఈ సమయంలో ‘మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదలినాడు’ అనే పాట వేశారు. ఈ సమయంలో ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలు చప్పట్లు కొడుతూ ఆ పాటకు స్టెప్పులేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

అంతకుముందు ప్రియాంకగాంధీ మాట్లాడుతూ… దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా? ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఫామ్‌హౌస్‌లో ఉండి పాలించే ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తారని.. కానీ తెలంగాణలో మాత్రం అన్నిచోట్ల పోటీ చేయడం లేదని మండిపడ్డారు. అక్రమాలతో దేశంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ ధనిక పార్టీలుగా మారాయని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.