రేపు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సందర్శన

కరోనా బాధితులను పరామర్శించనున్న సిఏం కెసిఆర్

TS CM KCR
TS CM KCR

Hyderabad: రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఆస్పత్రిలో కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆయన పరిశీలిస్తారు. సిఏం వెంట మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొననున్నారని తెలిసింది.అంతేకాకుండా, కేసీఆర్ ఎంజీఎంను సందర్శించి కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారితో నేరుగా మాట్లాడే అవకాశాలున్నట్లు తెలిసింది. అనంతరం కరోనా వైద్య సేవలపై ఆయన అధికారులతో సమీక్ష కూడా జరుపుతారని తెలిసింది.

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/