అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..

తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కోడెల శివప్రసాద్ రెండవ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై, హోం మంత్రి పై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడు హోమ్ మంత్రి సుచరిత పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది, దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం ఉపాధ్యక్షుడు వేముల ప్రసాద్ చేసిన ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

హోంమంత్రి పరువుకు భంగం కలిగించేలా మాట్లాడినందుకు సెక్షన్ 505 (2) ప్రకారం మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు సెక్షన్ 509, రాష్ట్ర ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన అందుకు సెక్షన్ 294(బి)తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. అయ్యన్న ఏమన్నాడో మరోసారి చూస్తే..సిగ్గు లజ్జ ఉంటే సుచరిత రాజీనామా చేయాలంటూ అయ్యన్నపాత్రుడు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మటన్ మార్ట్ లు, ఫిష్ మార్ట్ లు కాకుండా అంబటి అధ్యక్షతన మల్లె పూల వ్యాపారం చేస్తే బాగుంటుంది అంటూ అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. ఇవి మాత్రమే కాదు ఇంకా చాలానే మాటలు అనడం తో అయ్యన్న ఫై కేసు ఫైల్ చేసారు .