ఢిల్లీ రోహిణీ కోర్టు ప్రాంగణంలో కాల్పులు కలకలం

ఢిల్లీ రోహిణీ కోర్టు ప్రాంగణంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన లో ఏకంగా నలుగురు మృతి చెందారు. రోహిణి కోర్టు లోని రూమ్‌ నెంబర్‌ 207 లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఘటన లో నలుగురు మృతి చెందడంతో పాటు… ఓ లాయర్‌ కు కూడా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఓ కేసు విషయం లో రోహిణి కోర్టు కు గ్యాంగ్‌ స్టర్‌ జితేందర్‌ వచ్చాడు.

ఈ నేపథ్యం లోనే గ్యాంగ్‌ స్టర్‌ జితేందర్‌ తో పాటు మరో ముగ్గురు యువకులను కాల్చి చంపారు కొందరు దుండగులు. లాయర్ల మాదిరిగా కోర్టు కు వచ్చిన దుండగులు… వారి పై కాల్పులకు ఒడి గట్టారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. తీవ్ర గాయాలైన గోగీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన టిల్లు గ్యాంగ్ జితేంద్రను హత్య చేసిందని భావిస్తున్నారు. హత్యకు గురైన ఇద్దరు దాడి చేసిన వారిలో, రాహుల్ తమ 50 వేలు రివార్డ్ కలిగి ఉన్నారు. మరొకరు ఎవరనేది తెలియాల్సి ఉంది.