మహిళల జట్టుపై సౌరవ్ గంగూలీ ప్రశంసలు

అద్భుతంగా ఆడారు..ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారు

Women's Team Did a Great Job-Sourav Ganguly
Women’s Team Did a Great Job-Sourav Ganguly

ముంబయి: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ ఇండియా ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మహిళల జట్టుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా ఆడారని, ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారని ఆయన కొనియాడారు. ఈ జట్టును అమితంగా ఇష్టపడుతున్నానని చెప్పారు. మరోవైపు మహిళల జట్టుపై క్రికెట్ దిగ్గజాలు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్ తో పాటు కెప్టెన్ కోహ్లీ కూడా ప్రశంసలు కురిపించారు. కాగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోయి, ఫైనల్స్ లో ఓడిన మహిళల జట్టుకు అందరూ అండగా నిలుస్తున్నారు. చాలా గొప్పగా ఆడారంటూ మద్దతు పలుకుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/