తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి కీలక సూచనలు

Sri Venkateswara Swamy Vaari Temple
Sri Venkateswara Swamy Vaari Temple

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడే భక్తులు స్వామి వారి దర్శనానికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. ఆ లక్షణాలు కలిగిన వారు దర్శనానికి వస్తే భక్తుల రద్దీ కారణంగా వైరస్‌ వేగంగా వ్యాపించే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి తెలిపింది. తిరుమలకు వచ్చిన భక్తుల్లో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వారిని తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కు తరలించాలని అధికారులకు సూచించింది. అలాగే దర్శనానికి వచ్చే భక్తులు కూడా శానిటైజర్లు, మాస్కులతో రావాలని కూడా సూచించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/