క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర పెంపుపై మంత్రి కేటీఆర్ కామెంట్స్

గత పది రోజులుగా పెట్రోల్ , డీజిల్ ధరలు ఆకాశానికి అంటుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు చమురు సంస్థలు ధరలు పెంచుకుంటూ పోతుండడం తో సామాన్య ప్రజానీకం గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ధరలు తగ్గించాలని రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతుండగా..తాజాగా ఈరోజు క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌రను ఏకంగా రూ. 250 పెంచి మరింత షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెట్రోల్ , డీజిల్ ధరల మూలంగా నిత్యావసర ధరలు భారీగా పెరుగగా..ఇక ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధరను పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇంట్లో వాడే సిలిండర్ ధర పెంచకపోవడం తో కాస్త ఉపశమనం అవుతున్నారు.

ఇక క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర పెంపుపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేసారు. ఏప్రిల్ ఫూల్ త‌ర‌హాలో జోక్ అయితే బాగుండేద‌ని కేటీఆర్ ఎద్దెవా చేసారు. మొదటి నుండి కూడా ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న కేంద్ర ప్ర‌భుత్వాన్ని మంత్రి కేటీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా తప్పుపడుతూ వస్తునం సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌తో పాటు గృహ వినియోగ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచిన స‌మ‌యంలోనూ కేటీఆర్ కేంద్రాన్ని త‌ప్పుప‌డుతూ ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర పెంపుపై తన స్పందనను తెలిపారు.

I am seriously hoping this is an April fools joke! https://t.co/9smrxq6jTt— KTR (@KTRTRS) April 1, 2022