స్టాలిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కు తెలంగాణ సీఎం కేసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసీఆర్.. స్టాలిన్ కు ఫోన్ చేసారు. ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని, తాను మరిన్ని విజయాలు సాధించాలని, కోరుకున్న లక్ష్యాలను స్టాలిన్ చేరుకోవాలని సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు. తనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసిఆర్ కు ఎం. కె స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, కొద్ది రోజుల క్రితం తమిళనాడు పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆరాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ను ప్రత్యేకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/