హజ్‌ పై సౌదీ అరేబియా కీలక నిర్ణయం!

కొద్ది మందితో మాత్రమే హజ్ నిర్వహణ.. సౌదీ అరేబియా

Mecca
Mecca

సౌదీ: సౌదీలో హజ్ నిర్వహణపై సౌదీ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది మందితో మాత్రమే హజ్ జరపాలని నిర్ణయించారు. కరోనా వైరస్ దృష్ట్యా ఈ సంవత్సరం ‘లిమిటెడ్ హజ్’ మాత్రమే ఉంటుందన్న సౌదీ పాలకులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో నివసిస్తున్న వారు మాత్రమే దీనికి హాజరవ్వాలని తెలిపింది. కాగా కరోనా నేపథ్యంలో హజ్ యాత్రను ఎప్పట్లాగే నిర్వహిస్తే… సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యడం సాధ్యం కాదని సౌదీ అధికారులు అత్యంత క్లారిటీతో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి… తమ దేశం నుంచి కరోనాను తగ్గించే చర్యల్లో భాగంగా… ఈసారికి హజ్ యాత్రికుల సంఖ్యను కుదించడమే సరైన చర్య అని సౌదీ పాలకులు భావించారు.

ఏటా హజ్ యాత్రలో… ప్రపంచం నలుమూలల నుంచి 20 లక్షల మందికి పైగా పాల్గొంటారు. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలనేది వారి ప్రధాన నియమాల్లో ఒకటి. దాదాపు 40 రోజులపాటూ సాగే పవిత్ర యాత్ర ఇది. జులైలో మొదలవుతుంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో 54523 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 3393 మందికి కరోనా సోకింది. అలాగే నిన్న 40 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 1307కి పెరిగింది. కరోనా లెక్కలు ఇంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టే… అక్కడి పాలకులు… హజ్ యాత్ర విషయంలో కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/