ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చిన మైక్రోసాప్ట్

ఉద్యోగుల‌కు మైక్రోసాప్ట్ యాజ‌మాన్యం మ‌రో షాక్ ఇచ్చింది. ఈఏడాది జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పింది. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది సంస్థలోని ఫుల్ టైం ఉద్యోగుల జీతాలను పెంచబోమని ప్రకటించింది. బోనస్‌లు, స్టాక్ అవార్డులు, ఇతర ప్రోత్సాహకాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.

ఈ జనవరిలో మైక్రోసాఫ్ట్ ఏకంగా పది వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయమై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తాజాగా స్పందించారు. సంస్థ ఉద్యోగులు, వ్యాపారం, భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో ఇది మరింత ఆవశ్యకమని తెలిపారు.