మందు బాబులకు కిక్ ఇచ్చే వార్త..

తెలంగాణ మందుబాబులకు కిక్ ఇచ్చే వార్త..ఇప్పటివరకు వైన్ షాప్స్ లలో మాత్రమే అందుబాటులో ఉండే క్వార్టర్, హాఫ్‌ బాటిళ్లు ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా లభించబోతున్నాయి. దీని కోసం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ నిబంధనల్లో మార్పు తీసుకొచ్చింది. ఇందులో బార్లకు కూడా ఆర్థిక ఊతం అందించేలా పలు నిబంధలను సవరించింది.

కరోనా తో కుదేలైన బార్లు ఆర్థికంగా వ్యవస్థను నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బార్ల లైసెన్సింగ్‌ విధానాన్ని కూడా సులభం చేసింది. అలాగే బ్యాంకు గ్యారెంటీల తగ్గింపు, లైసెన్స్ రుసుము చెల్లింపుల్లో వెసులుబాటు వంటి చర్యలు తీసుకుంది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు అతి త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం.. బార్ అండ్ రెస్టారెంట్లలో క్వార్టర్, హాఫ్‌ బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి.