ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు టికెట్ రాకపోవడం ఫై సర్పంచ్ నవ్య కామెంట్స్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అధికార పార్టీ బిఆర్ఎస్ ముందే తమ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించి ఎన్నికలకు సిద్ధమైంది. 119 స్థానాలకు గాను 115 అభ్యర్థులను ప్రకటించారు. మిగతా నాల్గు స్థానాలను మాత్రం హోల్డ్ పెట్టారు. అయితే ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్ ఇవ్వగా…ఆరు స్థానాల్లో మాత్రం కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చారు.

ఆలా స్టేషన్ ఘనపూర్ కు సంబంధించి తాటికొండ రాజయ్య కు బదులు కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో తాటికొండ రాజయ్య కన్నీరుమున్నీరు అయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి చేరుకున్న కార్యకర్తలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. కిందపడి భోరున విలపించారు. ఆయనను ఆ పరిస్థితిలో చూసి అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన వెక్కి వెక్కి ఏడవటం చూసిన చాలా మందికి బాధ అనిపించింది కూడా.

అయితే.. ఆయనను చూసి బాధపడ్డవారిలో సర్పంచ్ నవ్య కూడా ఉండటం గమనార్హం. రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి.. రచ్చకీడ్చి చివరకు టికెట్ రాకుండా చేసిన సర్పంచ్ నవ్య, ఆయనను ఆ పరిస్థితిలో చూసి సంబురం చేసుకుంటుంది కానీ.. బాధపడటమేంటీ అనుకుంటున్నారా..? పాపం.. ఆమె అంత కఠినాత్మురాలు కాదంటా.. ఆమెలో కూడా అమ్మగుణం ఉందంటున్న నవ్యకు.. ఆయనను చూస్తే అయ్యో పాపం అనిపించిందంటా మరి..!