కాంగ్రెస్ పార్టీ ఫై ధ్వజమెత్తిన జగన్..దేవుడు బుద్ది చెపుతాడంటూ వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్..కాంగ్రెస్ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. బుధువారం తిరుపతి ఇండియా టుడే సమ్మిట్లో పాల్గొన్న ఆయన APCC చీఫ్ గా షర్మిలను నియమించడంపై స్పందించారు. ‘రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది. ఇప్పుడు మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర చేస్తోంది. నేను కాంగ్రెస్ కు రాజీనామా చేశాక మా చిన్నాన్నను మాకు వ్యతిరేకంగా పనిచేయించింది. విభజించి పాలించడం వాళ్ల నైజం. వీరికి దేవుడే గుణపాఠం చెబుతారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసిన..ఎంతమంది కలిసి యుద్ధం చేసిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘ఇచ్చిన హామీలను 98% అమలు చేశాం. ఏపీలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు చోటు లేదు. మా పోటీ టీడీపీ, జనసేనతోనే ఉంటుంది. సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నాం. వ్యతిరేకత ఉండటంతో కొందరికి టికెట్లు ఇవ్వడం లేదు. ప్రజలు మావైపే ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.