భారత్‌ చంద్రుడిపై తన నడకను ప్రారంభించింది: ఇస్రో ట్వీట్‌

‘India takes a walk on Moon’.. Rover Pragyan ramps down lander Vikram

బెంగళూరుః భారత్‌ చంద్రయాన్-3 అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువం పై విక్రమ్‌ ల్యాండర్‌ ను దించింది. జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వెల్లడించింది.

ఈ మేరకు గురువారం ఉదయం ఓ ట్వీట్‌ చేసింది. ‘చంద్రుడి కోసం చంద్రయాన్‌-3 రోవర్‌ భారత్‌లో తయారైంది. ఇప్పుడు అది ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చింది. దీంతో భారత్‌ చంద్రుడిపై తన నడకను ప్రారంభించింది’ అని ఇస్రో తన ట్వీట్‌లో పేర్కొంది. చంద్రుడి గుట్టు విప్పడంలో ప్రజ్ఞాన్‌ రోవర్‌ ముఖ్య పాత్ర పోషించనుంది. సెకనుకు ఒక్కో సెం.మీ వేగంతో ఇది ల్యాండర్‌ ర్యాంపు ద్వారా వడివడిగా బయటకు వచ్చింది.