ప్రముఖ టీవీ సీరియల్‌ నటి తునీషా శర్మ ఆత్మహత్య

బుల్లితెర నటి తునీషా శర్మ (20) ఆత్మహత్య చేసుకుంది. తునీషా శర్మ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించింది. ప్రస్తుతం సోనీ సబ్‌ టీవీలో ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ సీరియల్‌లో షహజాది మరియమ్‌ పాత్రలో నటిస్తున్నది. ఫితూర్‌, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాలలో కూడా కనిపించింది.

బుల్లితెర ఫై అతి చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తునీషా శర్మ..శనివారం ఆత్మహత్య చేసుకున్నది. టీవీ సీరియల్‌ సెట్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తునీషా శర్మ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనీషా మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.