అసెంబ్లీ వద్ద సర్పంచ్ల ఆందోళన

గుంటూరు (D) వెలగపూడిలోని అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్లు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సర్పంచ్లు ఛలో అసెంబ్లీకి తరలివచ్చారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందని.. వాటిని తమ ఖాతాల్లో జమ చేయాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు పీఎస్లకు తరలించారు.

వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల కార్లు తనిఖీ చేయకపోవడంతో అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్‌లు వచ్చారు. మరికొందరు సర్పంచ్‌ల టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్లలో వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీకి వెళ్లే మార్గం వద్ద సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచ్‌ల నినాదాలు చేశారు. నిరసనకు వచ్చిన సర్పంచ్‌లను పోలీసులు నిర్దాక్షణ్యంగా ఈడ్చిపాడేశారు. సర్పంచ్‌లను బూటు కాళ్లతో తన్నుతూ లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. పోలీసుల కాళ్ళపైన పడి మరీ తమ హక్కులను కాపాడాలని సర్పంచ్‌లు వేడుకున్నప్పటికీ పోలీసులు కనికరించని పరిస్థితి.