మేడిగడ్డతో మాకు సంబంధం లేదు: ప్రభుత్వానికి L&T లేఖ

మేడిగడ్డపై తమ నిర్వహణ 2022లోనే ముగిసిందని L&T ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ బ్యారేజీ వర్షాకాలం వరదను తట్టుకోగలదా? లేదా? అనేది నిర్ధారించుకోవాలని సూచించింది. కాఫర్ డ్యాం బ్యారేజీకి భద్రత కల్పించగలదని భావిస్తే.. తాము అందించిన ఖర్చుకు ఆమోదం తెలపాలంది. ప్రస్తుతానికి యజమాని నీటిపారుదల శాఖేనని.. కొత్తగా ఒప్పందం చేసుకుంటేనే పనులు చేపడతామని స్పష్టం చేసింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాకంగా నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించింది. అయితే మేడిగడ్డ నిర్మించిన మూడేళ్లకే కుంగిపోవడం కలకలం సృష్టించింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన కట్టిన ప్రాజెక్టు మూన్నళ్ల ముచ్చటగా మారిందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై భారీగా విమర్శలు వచ్చాయి. అప్పటి వరకు ఉ అంటే కాళేశ్వరం అ అంటే కాళేశ్వరం పేరు ఎత్తే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దీనిపై నోరుమెదపడం లేదు.

ప్రాజెక్టు కుంగిన తర్వాత దాని బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదేనని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు లేకుండానే మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది వట్టి మాటేనని అర్థమైంది. రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఇప్పటికే తెలిపిన L&T ఈ బ్యారేజీ వర్షాకాలం వరదను తట్టుకోగలదా? లేదా? అనేది నిర్ధారించుకోవాలని లేఖ రాయడం సంచలంగా మారింది. మరి వర్షాకాలంలో ఈ బ్యారేజ్ అనేది కష్టమే అని వారి మాటల్లో అర్ధం అవుతుంది. ఒకవేళ బ్యారేజ్ మొత్తం కూలిపోతే ఏంటి పరిస్థితి.? మరి ఇప్పటి ప్రభుత్వం దీనిపై ఏంచేయబోతుందో చూడాలి.