టీడీపీ చంద్రబాబు పెట్టిన పార్టీ కాదు : విజయసాయిరెడ్డి
ఎన్టీఆర్‌పై చంద్రబాబు అభాండాలు వేశారని ఆరోపణ

అమరావతి: వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు తర్వాత గుండెలు రగిలి క్షోభిస్తున్న ఎన్టీఆర్‌ను చనిపోయే వరకు చంద్రబాబు వదిలిపెట్టలేదన్న సాయిరెడ్డి.. ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని, స్త్రీ లోలుడని, అతని అవసరం రాష్ట్రానికి, పార్టీకి లేవని అవమానించని రోజు లేదని విమర్శించారంటూ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే చంద్రబాబు ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారని ఆయన విమర్శించారు.
ఇక టీడీపీ వేడుకలను టార్గెట్ చేసిన సాయిరెడ్డి.. ఎవరో (ఎన్టీఆర్) కన్న బిడ్డకు, ఇంకెవరో బర్త్ డే సెలెబ్రేట్ చేసినంత చంఢాలంగా ఉంది టీడీపీ ఆవిర్భావ కార్యక్రమం అంటూ సెటైర్ సంధించారు. టీడీపీ చంద్రబాబు పెట్టిన పార్టీ కాదన్న సాయిరెడ్డి.. ఎన్టీఆర్ నుంచి దొంగతనంగా గుంజుకున్నదని ప్రజలందరికీ తెలుసంటూ చురకలంటించారు. చంద్రబాబు కపట వేషాలు చూస్తూ ఆ పెద్దాయన ఆత్మ ఎంతగా క్షోభిస్తొందోనని సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/