రియల్ లైఫ్ లో జైల్లోకు వెళ్లొచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్

నటి వరలక్ష్మి శరత్ కుమార్ రియల్ లైఫ్ లో జైల్లోకు వెళ్ళొచ్చిందంట..ఈ విషయాన్నీ స్వయంగా ఆమె తండ్రి నటుడు శరత్ కుమార్ తెలిపారు. 2012లోనే ‘పోడాపోడి’ అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి. కానీ పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసినప్పటికీ అవేవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. దీంతో ‘పందెం కోడి 2’తో విలన్ గా మారింది. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసినప్పటికీ ఈమె యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. అలా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ‘తెనాలి రామకృష్ణ LLB’,’క్రాక్’, ‘నాంది’, ‘యశోద’,’వీరసింహారెడ్డి’ ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. తమిళ్ లో కంటే తెలుగులోనే ఈమెకు ఎక్కువ అవకాశాలు వస్తుండడం తో హైదరాబాద్ కు మకాం మార్చేసింది.

ఇదిలా ఉంటె తాజాగా ఈమె తండ్రి శరత్ కుమార్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..వరలక్ష్మి కి సంబదించిన పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. ‘ఇప్పుడు అందరూ వరలక్ష్మిని విజయశాంతితో పోల్చుతున్నారు. అది నిజమే. ఈమె సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు.. ఇప్పుడు అవసరమా అని అడిగాను. కానీ ఆమె సినిమాలు చేయడానికే సిద్ధమైంది. ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి ఆమె శ్రమనే కారణం. అలానే వరలక్ష్మి చాలా ధైర్యవంతురాలు. ఓరోజు రాత్రి.. మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉందని, ఇద్దరబ్బాయిల్ని కొట్టిందని ఫోన్ వచ్చింది. వారు అంతకు ముందు కారుకు డాష్ ఇవ్వడంతో వారిద్దరినీ చితకబాదింది.’ అని శరత్ కుమార్ చెప్పుకొచ్చారు.