అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో అల్లు అర్జున్..

అర్జున్ రెడ్డి మూవీ తో యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్న సందీప్ వంగా..త్వరలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టినట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. 2021 లో సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 1 మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా తో అల్లు అర్జున్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ మూవీ తర్వాత ఎవరి డైరెక్షన్లో చేస్తారా అనే ఆతృతను తెరపడిందని అంటున్నారు.

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా తో బన్నీ ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. బన్నీ బాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. హిందీలో బడా ప్రొడక్షన్ హౌస్ అయిన టీ సిరీస్.. బన్నీ-సందీప్ రెడ్డి ప్రాజెక్టుని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటివరకు ‘అర్జున్ రెడ్డి’ దాని హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తానేంటో ప్రూవ్ చేసుకున్న సందీప్.. ప్రస్తుతం ‘యానిమల్’ తీస్తున్నాడు. దీని తర్వాత బన్నీ మూవీ ని తెరకెక్కించనున్నారని సమాచారం.