టాలీవుడ్ ఇండస్ట్రీ ఫై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..ఆ నలుగురు కోసం ప్రభుత్వం ఆ పని చేయదు

Kodali Nani

గత కొద్దీ రోజులుగా సినిమా టికెట్స్ విషయంలో వైసీపీ సర్కార్ , టాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య అనేక చర్చలు , సమావేశాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ తీరు ఫై విమర్శలు చేసారు. అంత గత పది రోజులుగా వైసీపీ నేతలు ..పవన్ కళ్యాణ్ ఫై మాటల యుద్ధం చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు..చిత్రసీమ కు సంబంధం లేదని నిర్మాతల మండలి లేఖ రిలీజ్ చేసారు. అంత సెట్ అవుతుందని అనుకుంటున్నా సమయంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ లో చర్చ గా మారింది.

నలుగురు నిర్మాతలు, నలుగురు హీరోలను ద్రుష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని నిర్ణయాలు తీసుకోదని, అందరి సంక్షేమం పరిగనలోకి తీసుకుంటుుందని వ్యాఖ్యానించారు. అందరి ప్రయోజనాలు పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుతామంటే చూస్తూ ఊరుకోం అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి కాదని, జీవిత కాలంలో జగన్ మోహన్ రెడ్డిని ఎవ్వరూ భయపెట్టలేరని అన్నారు. ఆయనకు ప్రజల సపోర్ట్ ఉందని పవన్ అది తెలుసుకోవాలని హెచ్చరించారు.