సచిన్ కు మెగాస్టార్ శుభాకాంక్షలు
క్రికెట్ దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జన్మదినం సందర్భంగా విషెస్ తెలిపారు. ‘క్రికెట్ దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షాలు. ఒకే ఒక మాస్టర్ బ్లాస్టర్.. దేశం గర్వించదగిన నీవు… దేశానికి ఎప్పటికీ స్ఫూర్తిదాతగా నిలుస్తావు. దేవుడి ఆశీర్వాదాలు నీకు ఉంటాయి’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా సచిన్ జన్మదినం సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సామాన్యులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/