స్టయిలిష్ లుక్ లో సమంత

సమంత మళ్లీ షూటింగ్ లతో బిజీ కాబోతుంది. కొద్దీ నెలల క్రితం సామ్ మయోసైటిస్ అనే వ్యాధి బారినపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి బారినపడిన దగ్గరినుండి దీనికి సంబదించిన చికిత్స తీసుకుంటూ సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడం తో మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు సిద్దమవుతుంది. సెట్స్ ఫై ఉన్న సినిమాలతో పాటు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ఈ క్రమంలో ఈ భామ అమెరికన్ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్’కు హిందీ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే దీన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లోకి సమంతకు స్వాగతం చెబుతూ ఆమె పాత్రకు ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. లెదర్ జాకెట్, డెనిమ్ జీన్స్‌ ధరించి, కళ్ల జోడు పెట్టుకున్న సమంత చాలా స్టయిలిష్ లుక్ లో లేడీ జేమ్స్‌ బాండ్‌లా కనిపించింది. అమెరికన్ వెబ్‌ సిరీస్‌ లో ప్రియాంక చోప్రా చేసిన ఏజెంట్ నాదియా సింగ్ పాత్రను ఇక్కడ సమంత పోషిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్2లో ఉగ్రవాదిగా కనిపించి మెప్పించిన ఆమె ఇప్పుడు గూఢచారి పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది.

అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. భారత్ తో పాటు సెర్బియా, దక్షిణాఫ్రికాలోనూ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ మూవీ లో సమంత నటిస్తుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్ ఈ వారంలోనే మొదలవనుంది.