నాతో సినిమాలు చేసేందుకు ఏ నిర్మాత రావడం లేదు – కృష్ణవంశీ

కృష్ణవంశీ తెలుగు సినీ లవర్స్ కు ప్రత్యేకంగా ఈయన గురించి చెప్పాల్సిన పనిలేదు. సింధూరం, అంతఃపురం , ఖడ్గం , మురారి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందజేశారు. అలాగే భారీ డిజాస్టర్స్ కూడా ప్రేక్షకులకు అందజేశాడు. ఇప్పుడు ఆ డిజాస్టర్ సినిమాలే కృష్ణవంశీ కి ఛాన్సులు లేకుండా చేసాయి. ప్రస్తుతం రంగమార్తాండ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు అవకాశాలు రాకపోవడం ఫై క్లారిటీ ఇచ్చారు. ” నేను ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నానని అంతా అడుగుతున్నారు. గ్యాప్ నేను తీసుకోలేదు .. వచ్చింది. ‘నక్షత్రం’ సినిమా ఫ్లాప్ కావడం వలన, నాతో సినిమా చేయడానికి ఎవరూ సాహసించలేదు అంతే. తమ డబ్బు వెనక్కిరాదని అనిపించినప్పుడు సహజంగానే నిర్మాతలు భయపడతారు” అన్నారు. అలాగే ‘రంగమార్తాండ’ సినిమాను ఇప్పుడున్న పరిస్థితులలో తీయడం చాలా అవసరం. రాఘవరావు అనే నాటక రంగ నటుడు రిటైర్మెంట్ తీసుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తరువాత నిజ జీవితంలో తన పాత్రను తాను పోషించడంలో ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేదే కథ. డబ్బు అనేది బంధాలను .. అనుబంధాలను ఎలా విషపూరితం చేస్తుందనే పాయింట్ ఇందులో కనిపిస్తుంది” అని చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.