డైరెక్టర్స్ కు కొత్త తలనొప్పి పెడుతున్న సమంత

Samantha-Latest-Pics-from-the-sets-of-SamJam
Samantha-Latest-Pics-from-the-sets-of-SamJam

విడాకుల ప్రకటన చేసిన సమంత..ప్రస్తుతం సినిమాల ఫై ఫోకస్ పెట్టింది. పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు దూరం గా ఉంటూ..విభిన్న కథలకే పచ్చ జెండా ఊపిన సామ్..ఇప్పుడు మళ్లీ పాత పద్దతిలో ఆలోచిస్తుంది. ఇప్పటికే ఆమె శాకుంతలంలో నటించగా, తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సామ్‌ ఇప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌ నయన తారను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం సమంత తన సినిమాలు, షూటింగ్‌ల విషయంలో దర్శకులకు కొత్త నిబంధనలు పెడుతోందట. ఆ నిబంధనలకు ఆ డైరెక్టస్ ఒకే అంటేనే సినిమా చేస్తా అని చెపుతోందట.

తాను ఒప్పుకుంటున్న సినిమాల షూటింగ్స్‌ కేవలం చెన్నై పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలని నిర్మాతలకు కండీషన్స్‌ పెడుతోందట సామ్‌. ఒకవేళ హైదరాబాద్‌లో షూటింగ్‌ అయితే ఇండోర్‌ మాత్రమే పెట్టాలని కొరుతుందట. ఏం చేసిన ఇండోర్‌ షూట్స్‌ పెట్టమని చెబుతున్నట్లు సమాచారం. ఇక పబ్లిక్‌లో షూటింగ్‌ అయితే అసలు వద్దని చెబుతోందట. తన కండీషన్స్‌కు ఓకే చెప్తేనే సినిమాలకు సైన్ చేస్తోందట లేదంటే నో చెబుతోందని వినికిడి. సామ్ నిబంధనలకు కొంతమంది డైరెక్టర్స్ ఓకే చెపుతున్న..కొంతమంది మాత్రం ఆలా అయితే ఎలా అంటున్నారట.