ప్రభాస్ కు రెస్ట్ అవసరమని చెప్పిన డాక్టర్స్

వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..తాజాగా హాస్పటల్ కు వెళ్లడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ప్రభాస్ ఎందుకు హాస్పటల్ కు వెళ్లాడని అంత ఆరా తీయడం స్టార్ట్ చేసారు. అయితే ప్రభాస్ హాస్పటల్ కు వెళ్ళడానికి కారణం ఆయన జ్వరం బారినపడడమే. ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్ అనేది తీసుకోకుండా వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె , మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ , ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్. ఇలా ఈ మూడు పాన్ ఇండియా మూవీస్ సెట్స్ ఫై ఉన్నాయి. ఇలా ఒకేసారి మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ ఉండడం తో ఆయన కు జ్వరం వచ్చింది.

దీంతో హాస్పటల్ కు వెళ్లగా డాక్ట‌ర్స్ ఆయ‌న‌కి రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఇక డాక్టర్స్ సలహా మేరకు ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడట. దీంతో మారుతీ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో మార్పు వచ్చే అవకాశం ఉంది. మారుతీ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ ఇప్పటి వరకు టచ్ చేయని హారర్ కామెడీ జోనర్‌లో సినిమా ఉంటుందనేది సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తలు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ న‌టిస్తుండ‌టం విశేషం. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. వారిలో ఒక‌రు నిధి అగ‌ర్వాల్‌, మ‌రొక‌రు మాళ‌వికా మోహ‌న‌న్ కాగా.. మూడో హీరోయిన్ రిద్ధి కుమార్ న‌టిస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు.