‘మా’ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది

'మా' గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది

చిత్రసీమలో జరిగే మా ఎన్నికలు ఈసారి రాజకీయ ఎన్నికలను మించి జరిగాయి. బరిలో దిగిన ఇరు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసారు. కేవలం ప్రచారంలోనే కాదు పోలింగ్ బూత్ లోను బూతులు తిట్టుకుంటూ కొట్టుకోవడం , కొరకడం వంటివి చేసారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా మా గొడవలు సద్దుమణగడం లేదు. సోమవారం ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి పోలింగ్ జరిగిన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కు వెళ్లి సీసీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది.

ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. మా ఎన్నికల పోలింగ్ రోజున తన ప్యానెల్ కు చెందిన తనీశ్ పై దాడి జరిగిందని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనీశ్ పై దాడి జరిగిన విషయం సీసీటీవీ ఫుటేజి ద్వారా బయటికి వస్తుందని తాము భావిస్తున్నామని తెలిపారు.

అయితే, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నుంచి ఎలాంటి స్పందన రావడంలేదని, సీసీటీవీ ఫుటేజి కోసం కోర్టుకు వెళ్లమంటున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మా ఎన్నికల పోలింగ్ జరిగిన తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.