సురేఖ వాణి రహస్యంగా ఆ పనిచేసిందా..?

సురేఖ వాణి రహస్యంగా ఆ పనిచేసిందా..?

సీనియర్ ఆర్టిస్ట్..సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుందా..? ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇదే చర్చ నడుస్తుంది. 2019 లో ఈమె భర్త కన్నుమూశారు. అప్పటి నుండి తన కూతురితో జీవనం కొనసాగిస్తూ…సినిమా ఛాన్సులు దక్కించుకుంటూ ముందుకు వెళ్తుంది. కేవలం సినిమా ప్రేక్షకులనే కాదు సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత చేస్తూ నెటిజన్లను , ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన పిక్ అందరిలో అనేక అనుమానాలకు దారితీస్తుంది.

చీరకట్టు,మెడలో మంగళసూత్రంతో ఉన్న ఓ ఫోటోను షేర్‌ చేయడంతో నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సురేఖ వాణి సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది సినిమా షూటింగ్‌ కోసం ఇలా తయారయ్యిందేమో అంటూ మరికొందరు భావిస్తున్నారు. గతంలోనూ ఆమె సెకండ్ మ్యారెజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీయడంతో ఆ వార్తల్లో నిజం లేదని ఆమె స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె పెళ్లి టాపిక్‌ వైరల్ గా మారింది.