విడాకులు ప్రకటించిందో లేదో వెంటనే పేరు మార్చుకున్న సమంత

Samantha-Latest-Pics-from-the-sets-of-SamJam
Samantha-Latest-Pics-from-the-sets-of-SamJam

నాగ చైతన్య – సమంతలు తాము విడాకులు తీసుకుంటున్నట్లు శనివారం అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన రాగానే అంత షాక్ లో పడ్డారు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు , సినీ ప్రేక్షకులు ఈ వార్త అబద్దమైతే బాగుండని అనుకున్నారు. నిన్నటి నుండి సోషల్ మీడియా లో , మీడియా చానెల్స్ లలో ఈ విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక విడాకులు ప్రకటించిందో లేదో సమంత తన పేరును మార్చుకుంది.

సమంత రౌత్ ప్రభు అని ఉన్న పేరును పెళ్లి తర్వాత అక్కినేని సమంత గా మార్చుతుంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో సమంత తన పేరును సమంత రౌత్ ప్రభు అంటూ మార్చుకుంది. ఇక నిన్నవిడాకులు ప్రకటించగానే..సమంత అని మాత్రమే పెట్టుకొని నేను సింగిల్ అన్నట్లు చెప్పకనే చెప్పింది.