ఈసీగా అరుణ్‌గోయల్‌ ఎంపికపై కేంద్రాన్ని ప్ర‌శ్నించిన సుప్రీంకోర్టు

supreme-court-questions-appointment-process-of-ec-arun-goel

న్యూఢిల్లీః కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా అరుణ్‌గోయ‌ల్ నియామ‌కానికి సంబంధించిన ఫైల్ మెరుపు వేగంతో క్లియ‌ర్ అయిన‌ట్లు ఈరోజు సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. 1985వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అరుణ్ గోయ‌ల్‌ను ఇటీవ‌ల కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల సంఘంలో ఉన్న ఖాళీ మే 15వ తేదీన ఏర్ప‌డింద‌ని, కానీ న‌వంబ‌ర్‌లో ఎందుకు ప్ర‌భుత్వం అంత దూకుడు ప్ర‌ద‌ర్శించింద‌ని, ఒకే రోజు క్లియ‌రెన్స్ ఇచ్చారు, అదే రోజు నోటిఫికేష‌న్ జారీ చేశార‌ని, ఆ రోజే ఎందుకు ఆమోదించార‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది.

క‌నీసం ఆయ‌న ఫైల్ క్లియ‌రెన్స్ కోసం 24 గంట‌ల స‌మ‌యం కూడా ప‌ట్ట‌లేద‌ని కోర్టు తెలిపింది. గోయ‌ల్ ఫైల్ మెరుపువేగంతో వెళ్లింద‌ని, దీన్ని మీరు ఎలా స‌మ‌ర్థిస్తార‌ని ధ‌ర్మాస‌నం ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల ఏర్పాటు కోసం స్వ‌తంత్య్ర వ్య‌వ‌స్థ కావాల‌ని వేసిన పిటిష‌న్‌పై గ‌త రెండు రోజుల నుంచి అయిదుగురు స‌భ్యుల సుప్రీం ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/