పవన్ కళ్యాణ్ మాటను లెక్క చేయని బీజేపీ

బద్వేల్ ఉప ఎన్నిక ఫై జనసేన తన ప్రకటన తెలిపింది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఆయన సతీమణికే వైసీపీ టికెట్ ఇవ్వడంతో తాము పోటీ చేయబోమని జనసేన ప్రకటించింది. జనసేన ప్రకటన తో బిజెపి కూడా ఇదే నిర్ణయం తీసుకుంటుందని అంత అనుకున్నారు కానీ బిజెపి మాత్రం షాక్ ఇచ్చింది.

పవన్ ప్రకటనకు భిన్నంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. బద్వేలు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. జగన్ పార్టీకి భయపడాల్సిన పని లేదని కడపలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. బద్వేల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ… ‘‘రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని బీజేపీ ప్రోత్సహించదు.. బద్వేలు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి ఏడేళ్లుగా నిధులిచ్చి ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.. రాష్ట్రంలో ఈ ఏడేళ్ల అభివృద్ధిపై చర్చించడానికి బీజేపీ సిద్ధం.. జగన్, చంద్రబాబుకు చర్చించడానికి సిద్ధమా?’’ అని సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. మరి బిజెపి ప్రకటన పట్ల జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.