మంచు విష్ణు ప్యానల్ కు మద్దతు తెలిపిన బాలకృష్ణ

మా ఎన్నికల వేడి ఏ రేంజ్ లో నడుస్తుందో చూస్తూనే ఉన్నాం..పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడం తో ప్యానల్ సభ్యులు తమ ప్రచారం లో బిజీ గా ఉన్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ తన మద్దతును విష్ణు ప్యానల్ కు ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్నీ స్వయంగా మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “ఈ మా ఎన్నికలలో నాకు ఆశీర్వదించిన మరియు మద్దతు ఇచ్చిన ఏకైక నటసింహం, బాల అన్నకు ధన్యవాదాలు. మీ మద్దతు నాకు లభించడం నా గౌరవం.” అంటూ మంచు విష్ణు పేర్కొన్నాడు. అంతేకాదు.. బాలయ్య తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు మంచు విష్ణు.

మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు ఇస్తుండడం తో..నందమూరి బాలకృష్ణ ఖచ్చితంగా మంచు విష్ణు ప్యానల్ కే మద్దతు ఇస్తారని ముందు నుండి అంత మాట్లాడుకుంటూ వచ్చారు. వారు అనుకున్నట్లే ఇప్పుడు బాలయ్య తన మద్దతు విష్ణు ఇచ్చారు. ప్రస్తుతం ఇరు ప్యానల్ సభ్యులు ఎవరికీ వారు తమ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఫైనల్ గా ఎవరు గెలుస్తారనేది చూడాలి.

Thank you the one and only NataSimham, Bala Anna for you blessings and support for me during these MAA elections. It is my honor to have your backing. ❤️ pic.twitter.com/xvYwBw8ZSz— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2021