బర్త్ డే స్పెషల్ పోస్టర్

‘శాకుంతలం’ నుంచి సమంత స్టిల్ విడుదల

A still from Shaakuntalam movie

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తొలి మైథలాజికల్ రొమాంటిక్ డ్రామా ‘శాకుంతలం’. ప్రముఖ దర్సకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమా గుణ నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని గత కొంత కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

తాజాగా సమంత పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర బృందం శాకుంతలంగా సమంత ముగ్ధమనోహరమైన రూపానికి సంబంధించిన లుక్ ని గురువారం ఉదయం విడుదల చేసి సామ్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

వూట్ సారీలో వయ్యారాలు పోతూ చెలికాడికై విరహ వేదనతో ఎదురుచూస్తున్న దేవకన్య కావ్యనాయకిలా కనిపిస్తున్న సమంత లుక్ చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. నాభి అందాలతో ముగ్ధమనోహరిగా సామ్ కనిపిస్తున్న తీరు విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.

మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు. అదితి బాలన్ ,అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ ,మోహన్ బాబు, గౌతమి కబీర్ బేడీ, మధుబాల, కబీర్ దుహన్ సింగ్, అల్లు అర్హ వర్షిణి సౌందరరాజన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/