ఆర్ఆర్ఆర్ నిర్మాత తో నాని మూవీ

RRR తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు సాధించిన నిర్మాత దానయ్య..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అగ్ర హీరోలే కాదు మీడియం హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ – సుజిత్ కలయికలో ఓ సినిమాను ప్రారంభించిన దానయ్య..తాజాగా నేచురల్ స్టార్ నాని తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

వివేక్ ఆత్రేయ – నాని కలయికలో ఓ యాక్షన్ మూవీ ని చేసేందుకు దానయ్య ప్లాన్ చేస్తున్నాడట. ఏప్రిల్ లో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్తారని సమాచారం. గతంలో వివేక్ ఆత్రేయ తో నాని అంటే సుందరానికి అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు.

కామెడీతో కొంత పరవాలేదనిపించుకున్న కూడా రొటీన్ కథతోనే సినిమా చేసాడనే టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. అయితే మరల ఇప్పుడు వివేక్ ఆత్రేయ నానితోనే నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కాస్తా బిగ్ స్కేల్ పై సాఫ్ట్ పెట్రన్ లో నడిచే కథ కాకుండా మాస్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేసి కథని సిద్ధం చేసి నానికి చెప్పి ఒప్పించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఇక ప్రస్తుతం నాని దసరా మూవీ తో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా ట్రైలర్ , సాంగ్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తూ వస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి.