మహేందర్ రెడ్డి ఫై మరో కేసు

వికారాబాద్‌ జిల్లా తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆడియో ఒకటి బుధవారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫై మహేందర్ రెడ్డి ఫై కేసు నమోదు కాగా..ఇప్పుడు మరోకేసు మహేందర్ ఫై నమోదు అయినట్లు తెలుస్తుంది.

రెండు రోజుల క్రితం రంజాన్ తోఫా పంపిణీ సందర్భంగా యాలాల ఎస్ఐ అరవింద్ కుమార్ ని దుర్భాషలాడారంటూ కేసు నమోదు అయ్యింది. యాలాలలో జరిగిన గొడవలో తన వర్గానికి చెందిన నేతలను పోలీసులు తీసుకెళ్తుండటంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ సందర్భంగా ఎస్ఐ అరవింద్ ను బూతులు తిట్టారు. దీనిపై ఎస్ ఐ తీవ్ర మనస్తాపం చెందారు. అరవింద్ ఫిర్యాదు మేరకు యాలాల పోలీస్ స్టేషన్ లో పట్నం మహేందర్ రెడ్డిపై ఐసీపీ 353, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక కేటీఆర్ సైతం మహేందర్ రెడ్డి ఫై ఆగ్రహం గా ఉన్నట్లు తెలుస్తుంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి..మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.మహేందర్ రెడ్డి వ్యవహారాన్ని ఆయన కేటీఆర్ కు వివరించినట్లు తెలుస్తోంది.ఘటనపై కేటీఆర్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ వ్యవహారంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ని అధిష్టానం పిలిచినట్టు సమాచారం.మరికాసేపట్లో ఆయన కూడా కేటీఆర్ తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.