‘సామజవరగమన’ నుండి లిరికల్ సాంగ్ రిలీజ్

శ్రీవిష్ణు – రెబా మోనికా జాన్ జంటగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘సామజవరగమన’. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజేశ్ దండ నిర్మించగా, మే 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఏం బోర్ కొట్టిందో’ అంటూ సాగే ఈ పాటలో హీరో మందుకొట్టేసి తన ఫ్రెండ్స్ తో కలిసి చిందులేస్తూ పాడుతుంటాడు. గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, జెస్సీ గిఫ్ట్ ఆలపించాడు.

ఈ సినిమాలో వెన్నెల కిశోర్ .. నరేశ్ .. శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘రాజ రాజ చోర’ సినిమా తరువాత శ్రీవిష్ణుకి ఇంతవరకూ హిట్ పడలేదు. దీంతో ఈ మూవీ ఫై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

YouTube video