చక్కెర స్థాయిలను నియంత్రించే ఉప్పు నీరు

Sugar Level Testing
Sugar Level Testing

ఉప్పు అనేది ప్రతి ఒక్కరి కిచెన్‌లో కనిపించే అత్యంత సాధారణమైన పదార్థం. ఇది అనేకమైన వంటకాలలో రుచిని పెంచే కీలకమైన పదార్థంగా కూడా ఉంటుంది. ఈ సహజసిద్ధమైన ఖనిజ పదార్థం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉఆన్నయి. శరీర బరువును తగ్గించడం, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడం మొదలైన వంటివి. కానీ అందాన్ని మెరుగుపరచడంలో ఉప్పును సహాయపడుతుందని మీకు తెలుషా? సాల్ట్‌వాటర్‌ వల్ల చర్మం, జుట్టుకు అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఇలాంటి సౌందర్య ప్రయోజనాలు పొందడానికి సముద్రం ఉప్పు నీటిని వాడవచ్చు. లేదా ఇంట్లో

వాడే ఉప్పును కూడా వాడవచ్చు. ఉప్పుకు నీటిని జతచేసి ఈ నీటిని జుట్టు చర్మంపై బాహ్యంగా ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. దీనికి గల ప్రధాన కారణం ఉప్పు నీటిలో కాల్షియం, పొటాషియం, సిలికాన్‌, సోడియం వంటి ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మన సౌందర్యానికి మెరుగులు దిద్దడంలో ఈ ఉప్పునీరు బాగా తోడ్పడుతుంది. ఉప్పు నీటిలో ఉండే హీలింగ్‌ ప్రాపర్టీస్‌ మొటిమలను, పింపుల్స్‌ త్వరగా నివారించడంలో బాగా సహాయపడుతుంది.
సముద్ర తీర ప్రాంతంలో నివసించే వారైతే నిజంగా చాలా లక్కీ! ఒక కప్పు నీరు ఒక టేబుల్‌ స్పూన్‌ సముద్రపు ఉప్పు తీఉకుని బాగా కలపాలి. ఇందులో దూదిని ముంచి ప్రభావిత ప్రాంతాలలో నెమ్మదిగా అప్లై చేయాలి. అలా ఆ ప్రాంతం పొడిగా మారిన తరువాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వేగవంతమైన ఫలితాల కోసం రోజులో ఒకసారి ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. సముద్రపు ఉప్పులో ఉండే యాంటీ ఇన్ప్లమేషన్‌ ప్రాపర్టీస్‌ వల్ల వైద్య ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా ఉండేలా చేస్తాయి. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల చర్మానికి చికాకు కలిగించే బాక్టీరియాను చంపడంతో పాటు, చర్మానికి ఉపశమనాన్ని కలుగజేయడంలో కూడా సహాయపడుతుంది. బాత్‌టబ్‌లో ఉన్న వేడినీటిలో ఒక కప్పు ముద్రపు ఉప్పు కలపాలి. లావెండర్‌ ఇతర ముఖ్యమైన ఆయిల్స్‌ కొన్ని చుక్కలను ఈ నీటిలో కలిపితే మంచి సువాసన వస్తుంది.
కఠినమైన గుణాన్ని కలిగి ఉండే ఉప్పు, చర్మాన్ని మరింత మెరుగుపరిచగల ఉత్తమమన ప్రక్రియలో ఒకటెన ఎక్స్పోలియేషన్‌ ప్రక్రియకు దోహదపడుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/