ధైరాయిడ్‌ ప్రభావం

Thyroid effect

గొంతు బొంగురు పోయినా, జుట్టు ఊడుతున్నా, బరువు పెరుగుతున్నా ధైరాయిడ్‌ అని భయపడతాం కాని కొంతవరకు కావచ్చు. కాని దానిపైన స్పష్టం ఉండాలి. ధైరాయిడ్‌ సమస్యలు రెండు రకాలు. ధైరాయిడ్‌ గ్రంథి మెడ దగ్గర ఉంటుంది. ఇది రక్తంలో కలిసిపోయే రెండు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. అవే ధైరాక్సిన్‌, ట్రైఅయోడో థైరోనైన్‌. ఈ రెండూ శరీరంలోని కణాలు సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మెటబాలిజమ్‌ను ప్రభావితం చేస్తాయి. ఈ థైరాయిడ్‌ గ్రంథి మెదడులోని పిట్యూటరీ గ్రంథి అధీనంలో పనిచేస్తుంది.

చాలా మంది తేలిగ్గా కొన్ని లక్షణాలను బట్టి ధైరాయిడ్‌ వస్తుందంటారు. కానీ ఇది రెండు రకాల్లో ఉంటుంది. అందులో మొదటిది హైపోథైరాయిడిజం. థైరాయిడ్‌ గ్రంథి నుంచి హార్మోన్ల విడుదల తక్కువ కావడమే హైపోథైరాయిడిజం. సమస్య పెరిగేకొద్దీ ఒళ్లంతా చల్లగా అనిపించడం, త్వరగా అలసిపోవడం, చర్మం పొడిబారడం, ఏదీ గుర్తుండకపోవడం, మానసిక ఆందోళన, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఈ సమస్యలు థైరాయిడ్‌తో సంబంధం లేకుండా కూడా తలెత్తవచ్చు. కాబట్టి చాలా మంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు. అయితే పదే పదే ఎదురవుతుంటే ధైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించే హార్మోను టిఎన్‌హెచ్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది. థైరాయిడ్‌ పనితీరు మందగించడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. కానీ కొందరిలో కొన్నిసార్లు అది థైరాయిడ్‌ గ్రంథి కణాలను కూడా హానిచేసేవిగా భావించి దాడి చేయవచ్చు. అలాగే థైరాయిడ్‌ గ్రంథిని పూర్తిగా లేదా ఒక భాగం తీసేయడం, థైరాయిడ్‌ క్యాన్సర్‌, రేడియేషన్‌ వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు. కొందరికి పుట్టుకతోనే హైపోథైరాయిడిజం ఉంటే, మరికొందరికి అసలు ఆ గ్రంథే ఉండదు. కొన్ని రకాల మందులు కూడా హార్మోన్లు విడుదలను నియంత్రిస్తాయి. థైరాయిడ్‌ హార్మోను విడుదల కావడానికి అయోడన్‌ అవసరం. అయితే కొన్ని సందర్భాల్లో అయోడిన్‌ని కొందరు విపరీతంగా తీసుకుంటారు లేదా అసలు తీసుకోరు.

అలాంటప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. ఏ కారణ: చేతనైనా పిట్యూటరీ గ్రంథికి హాని జరిగినా, ట్యూమర్‌ ఉన్నా, రేడియేషన్‌ వల్ల థైరాయిడ్‌ గ్రంథికి అది ఆదేశాలు జారీ చేయలేదు. విపరీతంగా అలసిపోవడం, బరువు పెరగడం, కండరాల నొప్పులు, చలి, మలబద్ధకం, చర్మం పొడిబారడం, పాలిపోయినట్లు ఉండటం, ముఖం ఉబ్బడం, కీళ్లనొప్పులు, గొంతు బొంగురుపోవడం, నెలసరిలో తేడాలు, మెడ కింద వాపు వంటివన్నీ దానికి సంకేతాలే. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు తేలిగ్గా తీసుకోకుండా వైద్యుల్ని సంప్రదించాలి.

టిఎన్‌హెచ్‌ చేయడం వల్ల థైరాయిడ్‌ హార్మోను థైరాక్సిన్‌ ఏ మేరకు తయారుచేస్తోందనేది తెలుస్తుంది. అది ఎక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం వచ్చినట్లే. దీనికి పూర్తిస్థాయిలో చికిత్స అంటూ ఉండదు కానీ రాకుండా నియంత్రించవచ్చు.

థైరాక్సిన్‌ హార్మోన్‌ని మాత్రల రూపంలో అందిస్తారు. అయితే థైరాక్సిన్‌ని చాలా తక్కువగా లేదా ఎక్కువగా కాకుండా సమతూకంలో తీసుకోవాలి. తక్కువగా తీసుకుంటే హైపోథైరాయిడిజం అలాగే కొనసాగుతుంది. ఎక్కువగా హైపర్‌థైరాయిడిజం ఎదురుకావచ్చు. అంటే ఆ హార్మోను అతిగా విడుదల అయి దానివల్ల ఇతర సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా అలసట, నిద్రలేమి, విపరీతమైన ఆకలి, అందరికీ చల్లగా ఉంటే వేడిగా అనిపించడం. కండరాలు బలహీనమై వ్యాయామం చేయలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తే టిఎన్‌హెచ్‌ పరీక్ష తిరిగి చేయించుకోవాలి. ధైరాయిడ్‌ హార్మోను ఎక్కువగా ఉందని తేలితే ఆ మోతాదును తగ్గించుకోవాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/