పిల్లలపై అతిగారాబం వద్దు

ప్రేమతో పాటు క్రమశిక్షణ అందించాలి

ఉరుకులు, పరుగుల సంసారం. కుటుంబ బాధ్యతలు. ఉద్యోగ బాధ్యతలు. ఇవన్నీ సాటి మనిషిని కాస్త విశ్రాంతి, స్వేచ్ఛకు తీసుకునే సమయం లేకుండా చేస్తున్నాయి.

ఏ భార్యాభర్తలయినా ఇద్దరు పిల్లలుంటే చాలనుకుంటున్నారు. వారికి ఏది కావాలంటే అది తెచ్చిఇస్తున్నారు. ఏది అడిగినా కాదనలేరు. ఉదయం నుండి రాత్రి డిన్నర్‌లోకి ఏ రకమయిన వంటకాలు కావాలంటే అవి చేసిపెడుతున్నారు. ఇది అతిగారాబం.

ఒక్కోసారి ఆఫీసుకు వేళవుతున్నా, వృత్తిబాధ్యతల పరంగానో, సమయం దొరకనపుడో ఇలా వాళ్లు అడిగింది చేసి పెట్టకపోతే మారాం చేస్తారు. అంత గారాబం చేయటానికి కారణం తల్లిదండ్రులే. పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చామంటే మేము ఏది అడిగినా మా అమ్మానాన్నలు ఇస్తారు అన్న ధీమా వారిలో ఉండిపోతుంది.

వారు అడిగిందల్లా ఇవ్వటానికి ఒక్కోసారి పేరెంట్స్‌కి సమయం ఉండదు. చిరాకు తెప్పిస్తుంటారు. అయినా పిల్లలకు ఎంతో ఓపికగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటారు.ప్రేమతో పాటు క్రమశిక్షణ అందించాలి

అదే ఆసరాగా చేసుకుని పిల్లలు ఇంకా పెరిగి పెద్దవుతున్న కొద్దీ అలాగే మారాం చేస్తుంటారు. నెమ్మదినెమ్మదిగా పిల్లలు పెద్దవాళ్వతున్నప్పటికీ వాళ్లలో ఎలాంటి మార్పు రాదు.

ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూస్తూ కనీసం ఫస్ట్‌క్లాస్‌ మార్కులు కూడా రాకపోయేసరికి అప్పుడు తల్లిదండ్రులు తలపట్టుకుంటారు. అప్పటికీ గట్టిగా చెప్పాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.

కాబట్టి పిల్లలను చిన్నప్పట్నుంచే ఎందులో ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలో, ఎక్కడ ఎలా హద్దుల్లో ఉంచాలో సరైన నిర్ణయం ముందే తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి.

వారి భవిష్యత్తు దారి తప్పడానికి తల్లిదండ్రులు కారణమయ్యే అవకాశముంటుంది. కాబట్టి పిల్లలను ప్రేమతో చూడాలి. కాని అతిగారాబం చేయరాదు.

  • శ్రీనివాస్‌ పర్వతాల

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health/