చెలి చిట్కాలు

మహిళలకు ప్రత్యేకం

Kitchen Tips
Kitchen Tips

మెంతి కూరతో వంటలు చేసేటప్పుడు చేదు తెలియకుండా ఉండాలంటే కాసేపు వేడి నీటిలో ఉంచి దానికి కొద్దిగా ఉప్పు, పసుపు కలిపితే సరి..

Cupboard

ఎంతో ముచ్చటపడి చేయించుకున్న కప్ బోర్డులు కొద్ది కాలానికి కళ తప్పినట్టుగా తయారవుతాయి కదా.. ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని క్లాత్ తో తుడవండి… మళ్లీ కొత్తవాటిలా మెరిసి పోతాయి..

పప్పు త్వరగా ఉడకాలంటే అందులో నాలుగైదు చుక్కలు ఆవ నూనె వేసి చూడండి.. వేగంగా ఉడకటంతో పాటు రుచిగానూ ఉంటుంది..

కొత్త స్టీలు గిన్నెలు లేబుల్ తో పాటు వస్తాయి.. వీటిని తొలగించటం కాస్త ఇబ్బందే… అలాంటపుడు ఇలా చేసి చూడండి… కొత్త గిన్నెలను కాస్త వేడి అందేలా పొయ్యి మీద పెడితే స్టిక్కర్ సులువుగా వచ్చేస్తుంది.. శుభమైన క్లాత్ లో తుడిస్తే సరిపోతుంది..

పోపుల్లో వెల్లుల్లిని దంచి వేస్తాం… మంచూరియా, సూపు వంటి వాటితో పాటు కొన్ని రకాల కూరల్లో దీని అవసరం ఎక్కువ… అలాగని, ఒక్కోటీ ఏం తిరుగుతాం? ఈ మినీ ఛాపర్ ను తెచ్చేసుకోండి.. చిన్న సైజు మిక్సీ లాంటిదే.. దీనిలో వేసి పైన ఉన్న మీట నొక్కితే సరి.. కొద్దీ మొత్తంలో మిరపకాయలు, చిన్న ఉల్లిపాయలకు చక్కగా ఉంపయోగించు కోవచ్చు… చిన్న పిల్లల కోసం పండ్లను గుజ్జుగా చేసుకోవటానికీ సాయపడుతుంది..

‘నాడి’ (ఆరోగ్య సూచనలు, సలహాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health1/