ఆరేళ్లలో ‘షీ టీమ్స్’ అద్భుత ఫలితాలు
ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి స్వాతి లక్రా

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో గడచిన ఆరేళ్ల కాలంలో షీటీమ్స్ మంచి ఫలితాలు సాధించిందని ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి స్వాతి లక్రా పేర్కొన్నారు.
అక్టోబర్ 24తో తెలంగాణ షీటీమ్స్ ఆవిర్భవించి ఆరేళ్లు పూర్తయిందన్నారు. ఈ కాలంలో రాష్ట్రంలో పలుకీలకమైన పరిష్కరిస్తూ తెలంగాణ షీటీమ్స్ అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు..
రాష్ట్రంలో ఆడపిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందడగు వేస్తున్నామన్నారు.. 2014 అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో ఆడవాళ్లకు సంబంధించి 30,187కేసులు రాగా ఇందులో 3,144 ఎఫ్‌ఐఆర్‌లను షీటీమ్స్ నమోదు చేసిందన్నారు..
మిగిలిన కేసుల్లో కౌన్సెలింగ్, జరిమానాలు విధించిందన్నారు.. గ్రామీణ ప్రాంతాల్లోకూడ షీటీమ్స్ ఉండటంతో ఆయా గ్రామాల్లో ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు..
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/