ఉప్పు వంటకు మాత్రమే కాదు..

Salt

అన్ని ఉన్నా ఉప్పు లేకుండా ఏ వంటకు రుచి రాదు. అదే ఉప్పు మరోరకంగా వాడువచ్చు. చెక్కతో చేసిన కుర్చీలు, సోఫాలు కొన్న కొన్ని రోజులకు పాతవాటిలా మారతాయి.

అలాంటప్పుడు ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటిలో బట్టను తడిపి ఎండలో పెడితే కొత్తవాటిలా కనిపిస్తాయి. కొన్నిసార్లు బూట్ల నుంచి దుర్వాసన వస్తుంది.

అలాంటి సమయాల్లో వాటిపై కాస్తంత ఉప్పు చల్లితే ఆ వాసన పోతుంది. ఇత్తడి, రాగి పాత్రలు కొన్ని రోజులకు రంగు మారతాయి. వీటికి మెరుపు రావాలంటే బియ్యప్పిండిలో కొన్ని చుక్కలు వెనిగర్‌, వేసి కాసత ఉప్పు కలిపి తోమాలి.

చీమల బాధ ఉన్నప్పుడు వాటిపై కాస్త ఉప్పు చల్లితే పోతాయి. వంటింట్లో గట్టుపై గుడ్డు పడి వాసన వస్తుంటే కాస్త ఉప్పు చల్లి కాసేపటి తర్వాత శుభ్రం చేస్తే దుర్వాసన పోతుంది.

ఉప్పునీటిలో తడిని బట్టతో కిటికీ అద్దాలు తుడిస్తే మరకలు పోతాయి. కార్పెట్‌పై పడిన మరకలు పోవాలంటే ఉప్పు చక్కగా ఉపయోగపడుతుంది.
పాన్‌, పళ్లరసాల వంటివి పడినప్పుడు ముందుగా చల్లటి నీటిలో ముంచిన బట్టతో తుడవాలి. ఆ తరువాత ఉప్పు చల్లి ఆ తరువాత గట్టిగా దులపాలి. మరకలు పోతాయి.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/investigation/