దువ్వెనకు ఓ చరిత్ర వుంది

ఇంటింటా వస్తువులు

The comb has a history
The comb has a history

దువ్వెనతో రోజూ తల దువ్వుకుంటాం. ఎప్పటికెయ్యది ప్రస్తుతమనే.. రీతిలో వర్ధమాన ఫ్యాషన్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తలకట్టును తీర్చిదిద్దు కుంటుంటాం.

పని పూర్తయ్యాక దువ్వెనను పక్కన పడేస్తాం. అసలీ దువ్వెన ఎక్కడి నుంచి వచ్చింది. దీన్ని కనిపెట్టినదెవరు తెలుసుకున్నారా? తెలుసుకోవాలే గానీ దువ్వెనకు పెద్ద చరిత్రే ఉంది.

ఈ నిత్యావసర పరికరాన్ని దాదాపు అయిదువేల యేళ్ల కిందటే కనిపెట్టారు. అప్పట్లోనే పర్షియాలో దువ్వెనలు వాడకంలో ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి.

తొలిరోజుల్లో ఏనుగు దంతాలతో, తాబేటి చిప్పలతో దువ్వెనలు తయారుచేసేవారు. ఇవి దొరకడం కష్టం కాబట్టి తర్వాత కలప, లోహాలతో కూడా దువ్వెనలు తయారుచేయడం మొదలెట్టారు.

దంతపు దువ్వెనలు, తాబేటి చిప్ప దువ్వెనలు, కలప, లోహ దువ్వెనలు ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దేవాళ్లు.

అయితే ప్లాస్టిక్‌ వాడకంలోకి వచ్చాక దువ్వెనల తీరుతెన్నులు మారిపోయాయి. పాతకాలం దువ్వెలు మ్యూజియంలకే పరిమితమయ్యాయి.

పైగా దువ్వెన రూపు మారిపోయి రకరకాల మోడళ్లు వచ్చాయి. చివరికి కరెంటుతో, బ్యాటరీలతో పనిచేసే దువ్వెనలు కూడా వచ్చేశాయి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/