మునుగోడులో గొడుగులను పంచుతున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు

మొన్న గోడ గడియారాలు , ఈరోజు గొడుగులు ..ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ టిఆర్ఎస్ చేస్తున్న ప్రచారం. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా మునుగోడు లో. మునుగోడు ఉప ఎన్నిక..ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఈ ఉప ఎన్నికను టిఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని సన్నాహాలు చేస్తున్నాయి. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. సభలు , సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇక అధికార పార్టీ నేతలు అయితే ఓ అడుగు ముందుకేసి గోడ గడియారాలు , గొడుగులు పంచడం మొదలుపెట్టింది.

చౌటుప్పల్ మండలం, సంస్థన్ నారాయణపురం మండలంలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, కారు బొమ్మతో ఉన్న గడియారాలను ఇంటింటికీ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా గొడుగులను పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాములుగా నోటిఫికేషన్‌ వెలువడ్డాక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేపట్టే ఈ తాయిలాల పంపిణీని మునుగోడులో టీఆర్‌ఎస్‌ అప్పుడే మొదలుపెట్టిందన్న విమర్శలు వస్తున్నాయి.