ప్రచారంలో రాజగోపాల్‌ రెడ్డి టంగ్‌ స్లీప్‌ : అమిత్ షా లక్షల కోట్లు దోచుకున్నాడు

అప్పుడప్పుడు రాజకీయ నేతలు తన ప్రచారంలో టంగ్‌ స్లీప్‌ అవుతుంటారు. తమ పార్టీకి కాదని , ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని, సొంత పార్టీ నేతలపైనే విమర్శలు కురిపించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అలాగే టంగ్‌ స్లీప్‌ అయ్యి వార్తల్లో నిలిచాడు. అమిత్ షా లక్షల కోట్లు దోచుకున్నాడంటూ తెలిపాడు.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగుస్తుంది. గత కొద్దీ రోజులుగా ప్రధాన పార్టీల నేతలంతా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆదివారం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా..ఈరోజు బిజెపి నియోజకవర్గంలో భారీ సభలు , ర్యాలీ లు చేప్పట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే.. మునుగోడు బీజేపీ పార్టీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి టంగ్‌ స్లీప్‌ అయిన వీడియో వైరల్‌ అయింది. అమిత్ షా కుటుంబం లక్ష కోట్లు దోచుకుందట అంటూ కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి టంగ్‌ స్లీప్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఆ వీడియోను టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా తెగ వైరల్‌ చేస్తోంది.

https://twitter.com/krishanKTRS/status/1586877453750145024?s=20&t=0VSRGvPeNL6FtcW_003MEA